శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2021 (19:49 IST)

ఆదిపురుష్ షూటింగ్ మొదలు.. ఎప్పుడంటే?

Adipurush
బాహుబలి సినిమాతో భారీ ఫేమ్ పొందిన ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. రాధేశ్యామ్ సినిమా దాదాపు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తరువాత ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందనుంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలు ప్రకటిస్తూ దూసుకెళ్తున్నాడు. 
 
ఒకవైపు ఓం రౌత్ ఆదిపురుష్‌తో పాటు స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సలార్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ముందుగా ప్రభాస్ తన సరికొత్త సినిమా రాధేశ్యామ్ పూర్తయిన వెంటనే ఆదిపురుష్ మొదలు పెట్టాల్సిఉంది. ఈ సినిమా దాదాపు రూ.300ల కోట్ల బడ్జెట్‌తో రూపొందనుంది. అదేస్థాయిలో ఈ సినిమాపై అంచనాలు కూడా తారా స్థాయిలో ఉన్నాయి. 
 
అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో ప్రధాన పాత్రలు ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్‌లు బిజీ కానున్నారట. వీరితో పాటు మరికొందరు సీనియర్ స్టార్ నటులు కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. ఈ చిత్రీకరణ ముంబై ఫిల్మ్ స్టూడియోలో చేయనున్నారని సమాచారం.