సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 జనవరి 2021 (19:02 IST)

మళ్లీ కెమెరా ముందుకు రానున్న రియా చక్రవర్తి

డ్రగ్స్ కేసులో చిక్కుకుని జైలుపాలైన బాలీవుడ్ నటి రియా చక్రవర్తి. ఆమె బెయిలుపై విడుదలైంది. తన ప్రియుడు, బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా, ఈ కేసు కంటే మాదకద్రవ్యాల కేసులో ఆమె చిక్కుకుంది. దీంతో ఆమెను ముంబై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్టు చేసింది. ఆ తర్వాత జైలుపాలైంది. చివరకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. ఆమె నెల రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపింది. 
 
ఈ కేసులో ఆమెతోపాటు ఆమె సోదరుడు కూడా అరెస్టై ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ కేసు కారణంగా రియా తీవ్ర మనోవేదనకు గురైంది. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటోందట. 
 
త్వరలో సినిమా షూటింగ్‌కు కూడా హాజరుకాబోతోందట. రియా ఇప్పటికే ఓ చిన్న బడ్జెట్ సినిమాతో పాటు ఓ రియాలిటీ షోలో పాల్గొనేందుకు కూడా అంగీకారం తెలిపిందట. వచ్చే ఫిబ్రవరి నుంచి రియా షూటింగ్‌కు హాజరుకాబోతోందట.