నిలకడగా రజనీకాంత్ ఆరోగ్యం... సాయంత్రం డిశ్చార్జ్!!?
తీవ్ర అస్వస్థతకుగురై హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం ఇపుడు నిలకడగా ఉంది. ఈ మేరకు ఆదివారం ఉదయం అపోలో ఆస్పత్రి యాజమాన్యం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.
ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం అన్నాత్తై. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ నగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగింది. ఆ సమయంలో చిత్ర యూనిట్‌లోని ఏడుగురికి కరోనా వైరస్ సోకింది. దీంతో రజనీకాంత్‌కు కూడా కరోనా టెస్ట్ చేయగా నెగెటివ్ ఫలితం వచ్చింది.
అయితే, రజనీకాంత్‌కు ఉన్నట్టుండి రక్తపోటు అధికం కావడంతో ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో శనివారం కొన్ని పరీక్షలు చేశామని, వాటి రిపోర్టులు రావాల్సి ఉందని వైద్యులు పేర్కొన్నారు. రిపోర్టులను బట్టి రజనీకాంత్‌ను డిశ్చార్జ్ చేసే అంశంపై అపోలో వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా, రజనీకాంత్ ఆదివారం సాయంత్రం చెన్నైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కోసం బేగంపేట విమానాశ్రయంలో చార్టెడ్ ఫ్లైట్ రెడీగా ఉందట. ఆదివరం సాయంత్రం 6 గంటలకు రజనీకాంత్ ప్రత్యేక విమామంలో చెన్నై వెళ్తారని సమాచారం.