గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2020 (22:45 IST)

రజనీకాంత్ ఆరోగ్యం గురించి ఆందోళన కలిగించేది ఏమీ లేదు: హాస్పిటల్ (Video)

సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం గురించి ఆందోళన కలిగించేది ఏమీ లేదని హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్ తెలిపింది. ఆయనకు రక్తపోటు ఇంకా ఎక్కువ ఉన్నప్పటికీ, ఇది శుక్రవారం కంటే మెరుగైన నియంత్రణలో ఉందని వైద్యులు శనివారం తెలిపారు.
 
"ఆయనకు రాత్రి మరికొన్ని పరీక్షలు చేసాము. రజనీకాంత్ ఈ రోజు మరిన్ని టెస్టులు చేయనున్నాం. సాయంత్రానికి రిపోర్టులు లభిస్తాయి" అని ఆసుపత్రి తెలిపింది.
 
ఆయనకు బిపి మందులను జాగ్రత్తగా ఇస్తున్నాము. "రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని మరింత నిశితంగా పర్యవేక్షిస్తూ వున్నాము. అతని ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పూర్తి విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చాము. సందర్శకులను ఆయనను కలవడానికి అనుమతించడం లేదు. శనివారం సాయంత్రం నాటికి అతని ఆరోగ్యంపై నిర్ణయం తీసుకోబడుతుంది" అని వైద్యులు ఆయన ఆరోగ్యానికి సంబంధించి బులెటిన్‌లో తెలిపారు.