గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (19:30 IST)

ఈ అలవాట్లు ఆరోగ్యానికి మంచిది అని అతిగా చేస్తే... (Video)

అతి వ్యాయామం పనికిరాదు
శరీరానికి సరైన విశ్రాంతి ఇవ్వకుండా, అదే పనిగా వ్యాయామం చేయడం హానికరం. శరీరానికి కోలుకోవడానికి సమయం కావాలి, అందువల్ల, ప్రతి వారం ఒకటి లేదా రెండు రోజుల విశ్రాంతి అవసరం అని గమనించాలి.
 
అధికంగా మంచినీరు తాగితే...
మంచినీళ్లు తాగమన్నారు కదా అని మరీ ఎక్కువ నీరు త్రాగటం ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది అలసట, తలనొప్పిని ప్రేరేపిస్తుంది.
 
ప్రతి చిన్న విషయానికి మందులు వేసుకోరాదు
ప్రతి చిన్న విషయానికి అంటే.. చర్మం కాంతివంతంగా వుండాలో, జుట్టు ఊడిపోతుందనో కొందరు విపరీతంగా విటమిన్ సప్లిమెంట్లు తీసుకుంటారు. అలాంటివారికి గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం వుంటుంది. అధిక సప్లిమెంట్లు తీసుకోవడం శరీరంలో సమస్యను కలిగిస్తుంది.
 
చక్కెరలు తక్కువే కదా తింటే అధిక కేలరీలు
చక్కెర లేని ఆహారాన్ని తినేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. మోతాదుకి మంచి తీసుకుంటే శరీరంలో అధిక కేలరీలు వచ్చి చేరుతాయి. అలాగే, కృత్రిమ స్వీటెనర్లు మొదలైనవి కూడా హానికరం అని మనం మర్చిపోకూడదు. కనుక బెల్లం వంటి ఇతర సహజ వనరులను ఎంచుకోవడం మంచిది.