గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 ఆగస్టు 2021 (12:46 IST)

'సలార్' నుంచి అప్‌డేట్ : 23న ఉద‌యం 10.30ని.ల‌కు...

హీరో ప్రభాస్ బాహుబలి తర్వాత నటించిన చిత్రం 'సాహో'. ఈ చిత్రం తర్వాత ఆయన వరుస ప్రాజెక్టులను చేపట్టారు. ప్రస్తుతం ఆయన చేతిలో 'రాధే శ్యామ్', 'స‌లార్', 'ఆది పురుష్', 'ప్రాజెక్ట్ కె' అనే సినిమాలు ఉన్నాయి. 
 
వీటిలో స‌లార్ చిత్ర విష‌యానికి వ‌స్తే.. ఈ చిత్రాన్ని ‘కె.జి.యఫ్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్లో ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ చిత్రంలో శృతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది.
 
అయితే, ‘కె.జి.యఫ్’ కి పది రెట్లు మించి స‌లార్ ఉంటుందని ప్రశాంత్ ప్రకటించారు. అప్పటి నుంచి అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కొద్ది రోజులుగా ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయి నటిస్తున్నారని ప్ర‌చారం జ‌రుగుతుంది. 
 
ఈ సినిమాలో ఆయనది మెయిన్ విలన్ క్యారెక్టర్ అంటున్నారు. తాజాగా స‌లార్ టీం నుండి అనౌన్స్‌మెంట్ రాగా, రాజ‌మ‌నార్ అనే పాత్ర‌ను రేపు ఉద‌యం 10.30ని.ల‌కు రివీల్ చేయ‌నున్నామ‌ని చెప్పుకొచ్చారు.
 
అంద‌రు మ‌నోజ్ భాజ్‌పాయ్ పోస్ట‌ర్ రివీల్ చేస్తార‌ని అనుకుంటున్నారు. ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్న మనోజ్.. ఇందులోని నటనకుగాను ‘ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 2021’ బెస్ట్ యాక్టర్‌గా అవార్డ్ విన్ అయ్యారు. ఇప్పుడాయన ‘సలార్’లో విలన్‌గా ఎంత‌గా మెప్పిస్తాడో చూడాలి.