శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (22:11 IST)

అశ్విన్ దంపతులకు ప్రభాస్ శుభాకాంక్షలు.. ఫ్లవర్ బొకే, గిఫ్ట్ హాంపర్‌ను..?

Sumanth Ashwin
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సుమంత్ అశ్విన్ దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఫ్లవర్ బొకేను, గిఫ్ట్ హాంపర్ను పంపారు. ఆ విషయాన్ని ఎమ్మెస్ రాజు తన ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా అభిమానులకు తెలియచేస్తూ, డార్లింగ్ ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పారు. సుమంత్ అశ్విన్ నటించిన తాజా చిత్రం 'ఇదే మా కథ' మార్చి 19న విడుదల కాబోతోంది.
 
కాగా.. ప్రభాస్ కెరీర్ ప్రారంభంలో ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు 'వర్షం' చిత్రం రూపంలో అతనికి ఓ బ్లాక్ బస్టర్ మూవీని ఇచ్చారు. ఆ తర్వాత ప్రభాస్‌తో ఎమ్మెస్ రాజు నిర్మించిన 'పౌర్ణమి' కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా... మేకింగ్ పరంగా నటీనటులకు, సాంకేతిక వర్గానికి మంచి పేరు తెచ్చిపెట్టింది. 
 
అయితే... ఆ తర్వాత ప్రభాస్‌కు, ఎమ్మెస్ రాజుకు మధ్య ఏవో పొరపొచ్చలు ఏర్పడ్డాయని, అందుకనే ఆయన బ్యానర్‌లో ప్రభాస్ మళ్ళీ నటించలేదనే వార్తలు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొట్టాయి. 
 
అయితే... ఇవాళ ప్రభాస్ పరోక్షంగా ఆ వార్తలకు చెక్ పెట్టాడు. ఈ నెల 13 వ తేదీ ఎమ్మెస్ రాజు తనయుడు, హీరో సుమంత్ అశ్విన్ పెళ్ళి దీపికతో జరిగింది. ఈ దంపతులకు ప్రభాస్ శుభాకాంక్షలు తెలియజేశారు.