గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 21 నవంబరు 2019 (20:35 IST)

కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్’గా ప్రభుదేవా!

పోకిరి చిత్రాన్ని హిందీలో ‘వాంటెడ్’ పేరుతో సల్మాన్ ఖాన్ తో రీమేక్ చేసి బాలీవుడ్ లోనూ సూపర్ హిట్ కొట్టిన డాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా హీరోగా నటిస్తున్న తమిళ చిత్రాన్ని తెలుగులో ‘కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్’ పేరుతో విడుదల చేస్తున్నారు. పోకిరిలో మహేష్ బాబు పోషించిన డేర్ డెవిల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పేరు ‘కృష్ణమనోహర్’ అన్న విషయం తెలిసిందే. 
 
పవనపుత్ర ప్రొడక్షన్స్ పతాకంపై యనమల సుధాకర్ నాయుడు సమర్పణలో.. సీనియర్ ప్రొడ్యూసర్ ఆర్.సీతారామరాజు నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ డిసెంబర్ మొదటి వారంలో విడుదల కానుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభుదేవా నటిస్తున్న ఈ చిత్రంలో ‘అల వైకుంఠపురములో’ ఫేమ్ నివేదా పేతురాజ్ హీరోయిన్.

బాహుబలి ప్రభాకర్, సురేష్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తమిళంతోపాటు తెలుగులో సైమల్టేనియస్ గా ఈ చిత్రాన్ని డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. ప్రేమికుడుగా, దర్శకుడిగా అలరించిన ప్రభుదేవా.. సంఘవిద్రోహశక్తుల పాలిట సింహస్వప్నంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాడని నిర్మాత ఆర్.సీతారామరాజు చెబుతున్నారు.
 
ఈ చిత్రానికి మాటలు: రాజేష్, పాటలు: భువనచంద్ర, సంగీతం: డి.ఇమ్మాన్, నిర్వహణ: ఎస్.చంద్రశేఖర్ నాయుడు, సమర్పణ: యనమల సుధాకర్ నాయుడు, నిర్మాత: ఆర్.సీతారామరాజు, దర్శకత్వం: ముఖిల్ చెల్లప్పన్.