మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 28 డిశెంబరు 2019 (20:03 IST)

ప్రతిరోజు పండగే ఇప్ప‌టివ‌ర‌కు ఎంత క‌లెక్ట్ చేసింది..?

మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే చిత్రంతో బయ్యర్లు పండగ చేసుకుంటున్నారు. డీసెంట్ మౌత్ టాక్‌తో ప్రతిరోజూ పండగే కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. క్రిస్మస్ సందర్భంగా సెలవు కావడంతో ఈ చిత్రం ఆ అడ్వాంటేజ్‌ను ఫుల్‌గా క్యాష్ చేసుకుంది. 6వ‌ రోజు కూడా మొదటి రోజుకు వచ్చినట్లుగా కలెక్షన్స్ రావడంతో చాలా చోట్ల ప్రతిరోజూ పండగే చిత్రం బయ్యర్లకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.
 
తెలుగులో ఈ చిత్రం 16 కోట్లకు అమ్ముడుపోగా ఆరు రోజుల్లోనే ఈ చిత్రం 15.36 కోట్లు రాబట్టడం విశేషం. నిన్న ఒక్క రోజే దాదాపు 2.80 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. నైజాంలో ఈ సినిమా 5.5 కోట్లకు బిజినెస్ చేయగా, ఇప్పటికే 6.5 కోట్ల షేర్ ను రాబట్టింది. ఏడో రోజు ప్రతిరోజూ పండగే కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి రానుంది. 
 
మరోవైపు యూఎస్‌లో కూడా ప్రతిరోజూ పండగే హవా కొనసాగుతోంది. ఆరో రోజుతోనే $400K మార్క్‌ను క్రాస్ చేసింది. ఫుల్ ఫన్‌లో ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్లను దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు చూసుకుంటే ప్రతిరోజు పండగే 40 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. సాయి తేజ్ కెరీర్లో ఇంత భారీ ఎత్తున కలెక్షన్స్ రావడం విశేషం. 
 
మ‌రి.. ఫుల్ ర‌న్ ఇంకెంత వ‌సూలు చేస్తుంది అనేది ఆస‌క్తిగా మారింది. ఈ సినిమాతో సాయి తేజ్ ఫామ్ లోకి రావ‌డంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడ‌ట‌. టైటిల్‌కి త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమా త‌న‌కి పండ‌గ తీసుకువ‌చ్చింద‌ని స‌న్నిహితులు క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుంటున్నాడ‌ట‌.