శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 26 నవంబరు 2019 (18:37 IST)

త‌మ‌న్‌కి స‌ర్ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన తేజ్... ఏంటా గిఫ్ట్?

సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ప్రతి రోజు పండగే. ఈ చిత్రం నుంచి విడుదల చేసిన రెండు పాటలు కూడా సూపర్బ్ రెస్పాన్స్ సంపాదించుకున్నాయి. ఈ పాటల్ని అద్భుతంగా కంపోజ్ చేశాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. తమన్, సాయి తేజ్ ఫ్రెండ్‌షిప్ గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఎంతో ఇష్టమైన తన ఫ్రెండ్ తమన్‌కు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్‌తో నిజంగానే సర్ప్రైజ్ చేసాడు సాయి తేజ్.
 
ఇంత‌కీ ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే... తమన్ మ్యూజిక్ టేస్ట్‌కి తగ్గట్టుగా పెర్ల్ మాలెట్‌స్టేషన్ అనే మ్యూజిక్ ఇన్స్ర్టూమెంట్ గిఫ్ట్‌గా అందించాడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ. వీరిద్దరి కాంబినేషన్లో పలు సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. తనకు సాయి ఇచ్చిన గిఫ్ట్ గురించి తమన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 
 
‘‘నా ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ ఈ లవ్‌లీ పెర్ల్ మాలెట్ వర్క్‌స్టేషన్‌ను నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది నాకు చాలా పెద్ద సర్‌ప్రైజ్. ప్రతిరోజూ పండగే అన్న మాటను ఈయన నిజం చేసారు. సాయి చాలా మంచి వ్యక్తి. ఆయన సక్సెస్ కోసం ప్రార్ధిస్తున్నానంటూ ట్విట్టర్లో ఫొటోతో సహా పోస్ట్ చేసాడు.