పృథ్వీ కుమార్తె శ్రీలు నాయికగా ‘ఎస్.కె’ చిత్రం ప్రారంభం
సీనియర్ నటుడు పృథ్వీ (30 ఇయర్స్ ఇండస్ట్రీ) కుమార్తె శ్రీలు హీరోయిన్‌గా పరిచయం కానున్న ఎస్‌కె సినిమా ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కుంచల్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. సర్దార్ సుర్జీత్ సింగ్ నిర్మాత.
హీరో, దర్శకుడు చిరంజీవి కుంచల్ మాట్లాడుతూ, అన్ని కమర్షియల్ హంగులతో కామెడీ, థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. నా మొదటి మూవీ జీఎఫ్ విడుదలకు సిద్ధంగా ఉండగానే మరో సినిమా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది అని అన్నారు.
నిర్మాత సర్దార్ సుర్జీత్ సింగ్ మాట్లాడుతూ, 30 రోజులపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. పృథ్వీ కీలక పాత్రలో కనిపిస్తారు అని చెప్పారు.
హీరోయిన్ శ్రీలు మాట్లాడుతూ కథ వినగానే అంగీకరించా. ఈ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం కావడం ఆనందంగా ఉంది. సినిమాకు కథ, స్ర్కీన్‌ప్లే ప్రధాన బలం అన్నారు.
గడ్డం నవీన్, అభిరామ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వలి, మ్యూజిక్ :శ్రీ వెంకట్, టీమ్: నరేంద్ర, శ్రీకృష్ణ, ఎస్.కృష్ణ.