శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 డిశెంబరు 2021 (08:36 IST)

కలెక్షన్ల పరంగా కుమ్మేస్తున్న పుష్ప-బాహబలి రికార్డ్ బ్రేక్

పుష్పగా వచ్చిన అల్లు అర్జున్ రికార్డులను బ్రేక్ చేసుకుంటూ చరిత్ర సృష్టిస్తున్నాడు. కలెక్షన్ల పరంగా పుష్ప కుమ్మేస్తున్నాడు. దీంతో సాహో, బాహుబలి రికార్డులను పుష్ప బ్రేక్ చేశాడు.

నైజాంలో తొలి రోజే 'పుష్ప' సినిమా రూ.16.5 కోట్ల గ్రాస్, రూ.11.44 కోట్ల షేర్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు నైజాం ఏరియాలో టాప్ గ్రాసర్లు 'సాహో', 'బాహుబలి-2' సినిమా రికార్డులను అధిగమించింది.
 
గతంలో ప్రభాస్ నటించిన సాహో సినిమా నైజాంలో తొలి రోజు రూ.9.41 కోట్ల షేర్ వసూలు చేయగా బాహుబలి-2 మూవీ తొలి రోజు రూ.8.9 కోట్ల షేర్ వసూలు చేసింది. 
 
అయితే ఈ రెండు సినిమాలకు సింగిల్ థియేటర్లలో గరిష్ట టిక్కెట్ ధర రూ.150గా ఉండగా... ఇప్పుడు విడుదలైన పుష్ప మూవీకి మాత్రం టిక్కెట్ ధర రూ.200గా ఉంది. టిక్కెట్ ధరలలో తేడానే బన్నీ మూవీకి కలిసొచ్చిందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.