మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (19:02 IST)

పుష్పలో డిలీట్ చేసిన సీన్: వీడియో వైరల్

pushpa
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప. ఇందులో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక  హీరోయిన్‌గా నటించారు. సమంత స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమా స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. సాధారణంగా సినిమా నిడివి ఎక్కువ అయినప్పుడు అందులో కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్లో తీసేస్తారు అన్న విషయం తెలిసిందే. 
 
అయితే అలా ఎడిటింగ్ లో తీసేసిన సన్నివేశాలు కొన్ని చాలా బాగుంటాయి. మరికొన్ని చెత్తగా ఉంటాయి. అయితే.. ఈ సినిమాలో ఒక మంచి కామెడీ ఉన్న సన్నివేశాన్ని ఎడిటింగ్ నుంచి తీసేశారట. మైత్రి మూవీ మేకర్స్ మరియు ముత్తంశెట్టి మీడియాలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించడం జరిగింది. 
 
 తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఒక వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం నుండి డిలీట్ చేసిన ఒక వీడియోను చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో సైతం ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.