బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 2 జులై 2024 (17:56 IST)

నభా నటేష్ డార్లింగ్ చిత్రంలో నభా నటేష్ స్టైల్ లో రాహి రే సాంగ్

Nabha Natesh
Nabha Natesh
ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డార్లింగ్'. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. విడుదలకు ముందే సినిమా స్ట్రాంగ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రోమోలతో పాజిటివ్ ఇంప్రెషన్ కలిగించింది. ఫ్రస్ట్రేటెడ్ యాంథమ్‌గా ప్రమోట్ చేసిన ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ అయింది. ఈ రోజు, మేకర్స్ సెకండ్ సింగిల్-రాహి రే సాంగ్ ని లాంచ్ చేశారు.
 
ఫస్ట్ సింగిల్ ఫ్రస్ట్రేటెడ్ యాంథమ్‌ ఐతే, రాహి రే ఎంజాయ్ బుల్ మెలోడీ. ఇది సోలో అడ్వెంచర్‌కి సౌండ్‌ట్రాక్. సాంగ్ నభా నటేష్‌ను సోలో ట్రిప్‌లో ప్రజెంట్ చేస్తోంది. ఆమె ఇండియాలోని వివిధ ప్రదేశాలను ఎక్స్ ఫ్లోర్ చేస్తూ, బెస్ట్ మెమోరీస్ ని ఎక్స్ పీరియన్స్ చేస్తుంది. ఈ జర్నీని సినిమాటోగ్రాఫర్ నరేష్ రామదురై అందంగా చిత్రీకరించారు.
 
వివేక్ సాగర్ కంపోజ్ చేసిన ఈ పాటలో నభా నటేష్ సూపర్ కూల్ గా కనిపించింది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ క్యాచిగా వున్నాయి.  కపిల్ కపిలన్ అద్భుతంగా పాటని ఆలపించారు. ఫస్ట్ సాంగ్ లానే  రాహీ రే కూడా ఇన్స్టెంట్ హిట్‌గా నిలిచింది.
 
బ్రహ్మానందం, విష్ణు, కృష్ణతేజ్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు.
 
హేమంత్ డైలాగ్స్ రాయగా, లవ్ టుడే ఫేం ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిట్ చేస్తున్నారు. గాంధీ ప్రొడక్షన్ డిజైనర్.
 
'డార్లింగ్' మూవీ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
 
నటీనటులు: ప్రియదర్శి, నభా నటేష్, బ్రహ్మానందం, విష్ణు, కృష్ణ తేజ్, అనన్య నాగళ్ల తదితరులు