శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2019 (19:36 IST)

''ఐ లవ్ యూ'' అంటూ ప్రపోజ్ చేసిన రాహుల్.. నాకు లవ్వర్ వున్నాడన్న పున్ను..!

బిగ్ బాస్ మూడో సీజన్‌లో భాగంగా లవ్ బర్డ్స్ అని పేరుతెచ్చుకున్న పునర్నవి, రాహుల్‌ల మధ్య చోటుచేసుకున్న తాజా వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. బిగ్ బాస్ ప్రారంభం సమయంలో జరిగిన ఓ ఎపిసోడ్‌లో రాహుల్, పునర్నవి, వరుణ్ సందేశ్ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఆ సమయంలో రాహుల్.. పునర్నవిని నీతో డేటింగ్ చేయాలంటే ఏం చేయాలి..? అని అడిగాడు. అందుకు తాను ఖాళీగా లేనని చెప్పింది. అప్పటి నుంచి వీరి పులిహోర కహానీ ప్రారంభమైంది.
 
తాజాగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో రాహుల్.. పునర్నవికి ప్రపోస్ చేశాడు. వరుణ్, వితికతో కలిసి వీళ్లిద్దరూ మీటింగ్ పెట్టారు. ఈ సందర్భంగా వితిక, ''నీకు నిజంగా పునర్నవి మీద ఫిలింగ్స్ లేవా?" అని రాహుల్‌ను ప్రశ్నించింది. 
 
దీనికి తనకు పున్ను అంటే ఇష్టం అని సమాధానం ఇచ్చాడు. కానీ, దీని వెనుక వేరే ఉద్దేశం లేదన్నాడు. అదే సమాధానం పునర్నవి కూడా చెప్పింది. ఈ సమయంలోనే రాహుల్.. పునర్నవి వైపు తిరిగి 'ఐ లవ్ యూ' అని చెప్పాడు. దీనికి పునర్నవి ఏమీ సమాధానం ఇవ్వలేదు. 
 
కానీ, వరుణ్ సందేశ్ మాత్రం ఆమెను గుచ్చి గుచ్చి అడిగాడు. దీంతో 'నాకు ఇప్పటికే లవర్ ఉన్నాడు. మేమిద్దరం ఎప్పటి నుంచో లవ్‌లో ఉన్నాము' అని చెప్పింది. దీంతో ఈ సంభాషణ ముగిసిపోయింది.