రాజారాణి సీరియల్ నటికి వేధింపులు.. కూతురిని కూడా వదల్లేదు..
ప్రముఖ తమిళ టీవీ నటి, రాజారాణి సీరియల్ ఫేం ప్రవీణాపై వేధింపులకు గురైంది. భాగ్యరాజ్ అనే విద్యార్థి నుంచి ఆమె వేధింపులకు గురవుతోంది. గతంలో ఆమె ఫోటోలను మార్పింగ్ చేసిన ఫోటోలను ఆన్ లైన్ లో షేర్ చేశాడు. ఈ విషయం తెలిసి ప్రవీణా కొన్ని నెలల క్రితం అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసుల అతడిని అరెస్ట్ చేశారు.
అయితే తాజాగా ప్రవీణాతో ఆమె కూతురు గైరీ నాయర్ ను కూడా టార్గెట్ చేశాడు. తన కూతురు ఫోటోలను కూడా మార్పింగ్ చేసి ఆన్ లైన్ లో విడుదల చేశాడు. దీంతో ప్రవీణా తన కూతురితో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
తన పేరు మీద వంద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి.. తనతో పాటు తన కూతురు, తన బంధువుల మార్ఫింగ్ ఫోటోలను అందరికీ షేర్ చేస్తున్నాడని ప్రవీణా ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.