సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 22 ఏప్రియల్ 2017 (20:43 IST)

ప్రభాస్ చేసిన ఆ పనికి టెన్షన్ భరించలేకపోయా... రాజమౌళి

అనుకుంటాం కానండీ... సెలబ్రిటీలు ఏది చెప్పినా దాన్ని వంకరగా చూడ్డం తప్పించి నేరుగా చూడరండీ బాబూ. రాజమౌళి జస్ట్ కొన్ని గంటల క్రితం బాహుబలి చిత్రం విశేషాల గురించి మాట్లాడుతూ... ప్రభాస్ గురించి కొద్దిగా చెప్పారు. అదేమంటే... సినిమా కోసం ఎంతో కష్టపడే ప్రభా

అనుకుంటాం కానండీ... సెలబ్రిటీలు ఏది చెప్పినా దాన్ని వంకరగా చూడ్డం తప్పించి నేరుగా చూడరండీ బాబూ. రాజమౌళి జస్ట్ కొన్ని గంటల క్రితం బాహుబలి చిత్రం విశేషాల గురించి మాట్లాడుతూ... ప్రభాస్ గురించి కొద్దిగా చెప్పారు. అదేమంటే... సినిమా కోసం ఎంతో కష్టపడే ప్రభాస్ నిజ జీవితంలో చాలా బద్ధకస్తుడని అన్నారు. ఇంకేముంది... ప్రభాస్ పరువు తీసేశాడంటూ మొదలెట్టేశారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారో చూద్దాం.
 
ఇటీవలే బాహుబలి 2 ట్రెయిలర్ ముంబైలో విడుదల సందర్భంగా విమానాశ్రయానికి వెళ్లారు. ఫ్లయిట్ టైం అవుతుండటంతో తామంతా గాభరా పడుతూ ప్రభాస్ ఎక్కడున్నారని అడిగితే... అక్కడే ఓ లాంజ్‌లో కూర్చుని వున్నారని అన్నారు. అక్కడికెళ్లి పోదాం.. అంటే... ఎందుకు, ఆగండి వెల్దాం అన్నాడు. టైం అవుతుంది కదా వెల్దాం అని శోభు అంటే... కష్టపడాలంటే రాజమౌళి వెంట వెళ్లండి, సుఖంగా రావాలంటే నన్ను ఫాలో అవండి అన్నాడు. 
 
ఏంటబ్బా అని చూస్తుండగానే సెక్యూరిటీ పర్సన్ వచ్చి 15 మంది సెక్యూరిటీ చెకప్ కోసం వున్నారని చెప్పారు. దాంతో ఐదుగురు బ్యాలెన్స్ వుండగా చెప్పమని అన్నాడు ప్రభాస్. దాంతో తాము ఈ టెన్షన్ భరించలేమని మేం వెళ్లిపోయాం. ఆ తర్వాత నెమ్మదిగా ప్రభాస్ వచ్చాడు. వస్తూనే చూశారా... ఇలా హేపీగా రావాలని అన్నాడంటూ రాజమౌళి చెప్పారు.