సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2024 (11:35 IST)

రాజమౌళి అంకితభావం స్ఫూర్తిదాయకం అంటూ రామ్ చరణ్ కితాబు

Rajamouli
Rajamouli
ప్రతి దర్శకులకూ ఓ విజన్ వుంటుంది. అన్ని క్రాప్ట్స్ లలో పట్టు వుండడం కీలకం. అందులో రాజమౌళి ముందు వరుసలో వుంటారని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కితాబిస్తున్నారు. ఇటీవలే రాజమౌళి ఓ డాక్యుమెంటరీ గురించి వార్త రాగానే అది ఇండస్ట్రీలోనూ బయట ఆసక్తి నెలకొంది. దాని గురించి రామ్ చరణ్ తన ఇన్ స్ట్రాలో .. రాజమౌళి గారు కథ చెప్పడం మరియు అతని క్రాఫ్ట్ పట్ల అంకితభావం నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ డాక్యుమెంటరీ అతని అద్భుతమైన కెరీర్‌కు పరిపూర్ణ నివాళి అంటూ స్పందించారు. 
 
బాహుబలి, RRR చిత్రాలతో గ్లోబల్ దర్శకునిగా రాజమౌళి అందరి ద్రుష్టి ఆకర్షించాడు. అలాంటి ఆయన నెట్ ఫ్లిక్స్   రీసెంట్ గానే ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని రిలీజ్ కి తీసుకొచ్చారు రాజమౌళి. మోడర్న్ మాస్టర్స్ అంటూ మొదలు పెట్టిన ఈ వెబ్ డాక్యుమెంటరీని ప్లాన్ చేయగా ఆయనతో పని చేసిన ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు తనపై ఇంట్రెస్టింగ్ అంశాలు రివీల్ చేశారు. ఇప్పుడు చరణ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ లో వుంది.