శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 24 నవంబరు 2018 (12:26 IST)

రజినీకాంత్‌కు ఏమైంది.. ఆరోగ్యంపై వదంతులు...

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు లోనైనట్టు వదంతులు వస్తున్నాయి. వీటిని ఆయన సన్నిహిత వర్గాలు ఖండించాయి. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ వందతులు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. 
 
ప్రస్తుతం చెన్నైలోని తన నివాసంలో ఉన్న రజినీకాంత్ అనారోగ్యానికి గురయ్యారని, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారని, ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం ప్రచారం వెల్లువెత్తింది. 
 
దీనిపై రజనీకాంత్‌ సన్నిహిత వర్గాలు స్పందిస్తూ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశాయి. వదంతులను నమ్మవద్దని కోరాయి. కొన్ని రోజుల క్రితం రజనీ 'గజ' తుఫాను బాధితులకు విరాళంగా రూ.50 లక్షలు ఇచ్చారు. మరోపక్క ఆయన నటించిన '2.ఓ' సినిమా నవంబరు 29న విడుదలకానుంది. 
 
అలాగే, రజనీ నటించిన తాజా చిత్రం 'పేట' ఆడియోను డిసెంబరు 9న విడుదల చేయనుంది. కార్తీక్‌ సుబ్బరాజ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష, సిమ్రన్‌, విజయ్‌ సేతుపతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సన్‌ పిక్చర్స్‌ సినిమాను నిర్మిస్తోంది.