గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శనివారం, 24 నవంబరు 2018 (10:50 IST)

జీలకర్ర తినాల్సిందే... ఎందుకంటే...

జీలకర్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంటల్లో ఖచ్చితంగా వాడేది. ఇది కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, ఫాస్పరస్, సోడియం, పొటాషియం, విటనమి ఏ, సి వంటి పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆయుర్వేద వైద్య నిపుణులు జీలకర్రను నిత్యం వంటల్లో విధిగా వాడాలని సూచిస్తున్నారు. 
 
ముఖ్యంగా ఫైల్స్ ఉన్నవాళ్లు చిటికెడు జీలకర్ర రోజూ నమిలితే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని వారు చెబుతున్నారు. అంతేనా, జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంటడం వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ తయారుకావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే, శరీరంలో ఐరన్‌ లోపం వల్ల వచ్చే రక్తహీనత తగ్గించుకోవడానికి ఇది సహాయపడుతుంది. అలాంటి జీలకర్ర ఉపయోగాలను ఓసారి తెలుసుకుందాం. 
 
* జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో చేరిన మలినాలను తొలగించి ప్రీ రాడికల్స్‌ను నివారించి, వ్యాధులను తట్టుకునేలా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
* యాంటీ ఏజింగ్‌గా పనిచేసి చర్మంపై ముడతలురాకుండా నివారిస్తుంది. ఇందుకు జీలకర్రలో విటమిన్‌ ఇ ఎక్కువగా ఉండటమే కారణం.
* జీలకర్ర యాంటీ సెప్టిక్‌ కారణాలను కలిగి ఉండటం వల్ల జలుబు, ఫ్లూ కలుగజేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. 
* ఒక కప్పు కాచిన నీటిలో జీలకర్ర, అల్లం, తేనె, తులసి ఆకులు కలుపుకొని తాగడం వల్ల జలుబు నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. 
* జీలకర్ర కాలేయంలో పైత్యరసం తయారుకావడాన్ని ప్రోత్సహిస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 
* జీలకర్ర కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యలను దూరం చేస్తుంది. 
* రోజువారీ ఆహారంలో జీలకర్రను తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్‌ లెవెల్స్ త‌గ్గుతాయి. ఫలితంగా మధుమేహం నియంత్ర‌ణ‌లో ఉంటుంది.