ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 25 జనవరి 2017 (08:53 IST)

నేను చేసిన తప్పుకు ఆయన శిక్ష అనుభవించాడు.. ఆయన స్టార్ కాదు నా తండ్రి : హృతిక్ రోషన్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌పై బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రశంసల వర్షం కురిపించారు. తాను చేసిన తప్పును ఆయనపై వేసుకుని శిక్ష అనుభవించిన గొప్ప నటుడు అంటూ కితాబిచ్చారు.

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌పై బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రశంసల వర్షం కురిపించారు. తాను చేసిన తప్పును ఆయనపై వేసుకుని శిక్ష అనుభవించిన గొప్ప నటుడు అంటూ కితాబిచ్చారు. 
 
హృతిక్‌ రోషన్ తన తాజా చిత్రం 'బలం' (హిందీలో కాబిల్‌) ప్రమోషన్‌లో భాగంగా కోలీవుడ్‌ మామా అల్లుళ్లలపై ప్రశంసల జల్లు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో సూపర్‌స్టార్‌ రజినీకాంత్, ధనుష్‌ల గురించి హృతిక్‌ తన జ్ఞాపకాలను పంచుకున్నారు. 
 
రజినీకాంత్ గురించి హృతిక్‌ ఏమన్నాడంటే.. 'రజినీసార్‌ 'కాబిల్‌' ట్రైలర్‌ చూసి నా కష్టాన్ని మెచ్చుకున్నారు. ఒక గొప్ప స్టార్‌ నుంచి ప్రశంసలు దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. నేను తొలిసారి కెమెరా ముందు నిల్చున్నప్పుడు నా వయసు 12 ఏళ్లు. అది కూడా సూపర్‌స్టార్‌ రజినీకాంత్ పక్కన. రజినీ సార్‌ నటించిన 'భగవాన్ దాదా' సినిమాతో నా కెరీర్‌ ప్రారంభం కావడం గౌరవంగా భావిస్తున్నా.
 
అప్పుడు సరిగ్గా నటించక రీటేక్‌లు తీసుకునేవాణ్ణి. అయితే ఆయన ఆ తప్పును తనపై వేసుకుని, తన కోసం రీటేక్‌ చేద్దామని చెప్పేవారు. నాలో ఉత్సాహం తగ్గకుండా, స్ఫూర్తినింపేందుకు నా తప్పును ఆయనపై వేసుకున్నారు. అంతటి గొప్ప వ్యక్తి రజినీ సార్‌. నాకు తండ్రితో సమానం. మార్గదర్శకులు, స్నేహితుడు కూడా. పిల్లలు, పెద్దలు అందర్నీ సమానంగా గౌరవించే వ్యక్తి. 
 
ఆ వయసులో ఆయన ఎంతో పెద్ద స్టారో నాకు తెలియదు. తెలిశాక ఆయన్ని ఆరాధించకుండా ఉండలేము' అని పేర్కొన్నారు. అలాగే ధనుష్‌ గురంచి ప్రస్తావిస్తూ.. ఒక నటుడిగా ధనుష్‌ ఎంతో స్ఫూర్తినిస్తాడని, అతని నటన తనకు నచ్చుతుందన్నారు.