Daily Horoscope
✕

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

Written By దేవీ
Updated: మంగళవారం, 22 జులై 2025 (19:24 IST)
Cooli 24 days poster
సూపర్ స్టార్ రజనీకాంత్ తమిళ యాక్షన్ ఎంటర్‌టైనర్ కూలీ. ఈ సినిమాను ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ డిజిటల్ అరంగేట్రం గురించి గుసగుసలు ఊపందుకుంటున్నప్పటికీ, చిత్ర బృందం ఇంకా అధికారిక నిర్ధారణను జారీ చేయలేదు.
 
తాజాగా కూలీ సినిమా ఇంకా 24రోజులు విడుదలకు చేరువవుతోందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ బహుభాషా చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కాబోతోంది. సమాచారం మేరకు, కూలీ ఒక మాజీ తిరుగుబాటుదారుడి ఆకర్షణీయమైన కథ చుట్టూ తిరుగుతుంది. సత్యరాజ్, నాగార్జున అక్కినేని, సౌబిన్ బషీర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ నటించారు. బాలీవుడ్ ఐకాన్ ఆమిర్ ఖాన్ కూడా ఆశ్చర్యకరమైన అతిథి పాత్రలో కనిపించనున్నారు.
 
కూలీ చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ గతంలో విజయ్ నటించిన యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ లియోకు దర్శకత్వం వహించారు. కూలీతో, లోకేష్ మరో అద్భుతమైన సినిమా అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ నిర్మించారు. కాగా, డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూలీ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. కలానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి టాప్  టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. ఆనిరుధ్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్.

అన్నీ చూడండి

వైసిపి నాయకుడు నాగార్జున యాదవ్‌కు కోట రుక్మిణి 48 గంటల డెడ్ లైన్: రుజువు చేయలేకపోతే రూ. 10 కోట్ల నష్టపరిహారం

బైక్ ట్యాక్సీలపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును స్వాగతించిన ర్యాపిడో, ఏంటది?

జనసేనలో అల్లకల్లోలం సృష్టిస్తున్న నాయకులు, పదవీ ప్రమాణం రోజునే రాజీనామా చేసిన MPTC

రూ. 27,400 కోట్ల పరందూరు ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ ఎలా ఆపేస్తారు? తమిళనాడు విజయ్ సర్కారుకి హైకోర్టు షాక్

కిర్గిజ్‌స్థాన్‌లో అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ షారన్ రాచెల్ అబీ అద్భుత ప్రదర్శన, రూ. 3 లక్షల ప్రోత్సాహక పురస్కారం

అన్నీ చూడండి

డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్‌కు పాలీహెర్బల్ యాంటీ డయాబెటిక్ ఫార్ములా : ఎస్ఆర్ఎంటీ వెల్లడి

సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్

చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు

మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?

ఏ కూరగాయలు ఏ శరీర అవయవానికి మేలు చేస్తాయి?

తర్వాతి కథనం
Show comments