శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2023 (10:01 IST)

చంద్రబాబును కలవనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

rajinikanth
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలవబోతున్నారని తెలిసింది. ఈ మేరకు సోమవారం చంద్రబాబును రజనీకాంత్ కలవనున్నారని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాల కోసం నారా లోకేష్‌కు రజనీకాంత్ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. 
 
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును  సూపర్ స్టార్ కలవబోతున్నారనే వార్త ట్రెండ్ అవుతోంది. చంద్రబాబు అరెస్టయిన తర్వాత కూడా రజనీ స్పందించారు. నారా లోకేశ్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. తన మిత్రుడు చంద్రబాబు పోరాట యోధుడని ప్రశంసించారు