ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 12 అక్టోబరు 2017 (17:03 IST)

నాగార్జునతో కలిసి ప్రెస్‌మీట్‌కు వచ్చిన కొత్త పెళ్లికూతురు సమంత.. (వీడియో)

టాలీవుడ్ అందాల తార సమంత పెళ్లికి తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న రాజుగాది గది-2 సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ

టాలీవుడ్ అందాల తార సమంత పెళ్లికి తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న రాజుగాది గది-2 సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కొత్త పెళ్లి కూతురు సమంతతో పాటు రాజు గారి గది 2 సినీ యూనిట్ ప్రెస్ మీట్‌లో పాల్గొంది. పెళ్లికి త‌రువాత తొలిసారి మీడియా ముందుకు వ‌చ్చింది. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ.. టాలీవుడ్ మన్మథుడు నాగార్జునతో స్క్రీన్‌ను షేర్ చేసుకునే అవకాశం ఇంత త్వరలో వచ్చిందని తెలిపాడు. సమంత, నాగార్జునల మధ్య రాజుగారి గది2లో వున్న సన్నివేశాలను చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు. 
 
ఇకపోతే.. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో నాగార్జునతో క‌లిసి పాల్గొంది. ఎల్లో క‌ల‌ర్ డ్రెస్‌లో చిరున‌వ్వులు చిందిస్తూ స‌మంత ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. స‌మంత‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ప‌లువురు ఎగ‌బ‌డ్డారు.