మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 2 డిశెంబరు 2018 (10:01 IST)

నా లెహంగా ధర రూ.8 కోట్లు.. పెళ్లి ఖర్చు రూ.70 కోట్లు

బాలీవుడ్ సెక్సీ క్వీన్ రాఖీ సావంత్ డిసెంబరు 31వ తేదీన బాలీవుడ్ కమెడియన్ దీపక్ కలాల్‌ను పెళ్లి చేసుకోబోతోంది. ఇందుకోసం వెడ్డింగ్ కార్డు కూడా ముద్రించారు. ఇది సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదేసమయంలో రాఖీ సావంత్ తన పెళ్లికి కావాల్సిన బంగారు ఆభరణాలను దుబాయ్‌లో కొనుగోలు చేస్తున్నారు. కోట్ల విలుపైన బంగారు, వజ్రపు నగలను ఆమె కొంటున్నారు. 
 
అంతేనా, పెళ్లిలో తాను ధరించే లెహంగాను కూడా కొనుగోలు చేసిందట. దీని ధర రూ.8 కోట్లట. ఇటీవల పెళ్లి చేసుకున్న దీపికా పదుకొనే పెళ్లిలో ధరించిన లెహంగా ధర రూ.కోటి అట. అందుకే రాఖీ సావంత్ రూ.8 కోట్లు వెచ్చించి లెహంగా కొనుగోలు చేసిందట. 
 
దీనిపై ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నాకు తెలిసి దీపికా పదుకొనె ఆమె పెళ్లిలో కోటి రూపాయల విలువైన లెహంగా ధరించింది. అందుకే నా పెళ్లికి నేను రూ.8 కోట్ల విలువైన లెహంగా ధరించాలని అనుకుంటున్నాను. అలాగే, పెళ్లయిన తర్వాత దీపిక, తనకు కాబాయే భర్త దీపక్ కలాల్‌లు అన్నాచెల్లెళ్లు అవుతారు. మా పెళ్లికి షారూక్, సల్మాన్, కరీనా, దీపికలను ఆహ్వానించినట్టు చెప్పింది. 
 
ఆ తర్వాత రాఖీని పెళ్లాడనున్న దీపక్ స్పందిస్తూ, తమ పెళ్ళి ఖర్చు అంత ఎక్కువేం కాదు. కేవలం రూ.70 కోట్లు మాత్రమేనని చెప్పారు. అయితే, వీరి పెళ్లి జరుగుతుందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇది నిజమా కాదా అని తెలుసుకోవాలంటే డిసెంబరు 31వ తేదీ వరకు ఆగాల్సిందే.