బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 30 మే 2018 (10:26 IST)

'మహానటి' ఓ మాస్టర్ పీసన్న రకుల్ ప్రీత్.. చీవాట్లు పెట్టిన ఫ్యాన్స్...

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు టాలీవుడ్‌తో పాటు.. అటు మలయాళ సినీ అభిమానులు తేరుకోలేని షాకిచ్చారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సీనియర్ నటి సావిత్రి జీవిత కథ "మహానటి" పేరుతో దృశ్యకావ్యంగా వచ్చిన వ

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు టాలీవుడ్‌తో పాటు.. అటు మలయాళ సినీ అభిమానులు తేరుకోలేని షాకిచ్చారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సీనియర్ నటి సావిత్రి జీవిత కథ "మహానటి" పేరుతో దృశ్యకావ్యంగా వచ్చిన విషయం తెల్సిందే. మే 9వ తేదీన విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ సాధించి, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని అనేక సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
 
అలాగే, టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ చిత్రాన్ని చూసి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 'మ‌హాన‌టి' చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేసింది. మాస్ట‌ర్ పీస్ అంటూ వ‌ర్ణించింది. ఇక చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన కీర్తి సురేష్‌, స‌మంత అక్కినేని, విజ‌య్ దేవ‌ర‌కొండల ప‌ర్‌ఫార్మెన్స్‌పై ప్ర‌శంస‌లు కురిపించింది. 
 
అయితే సావిత్రి భ‌ర్త జెమినీ గ‌ణేష‌న్ పాత్ర పోషించిన దుల్క‌ర్ స‌ల్మాన్ పేరుని ఇందులో జ‌త చేయ‌క‌పోవ‌డంతో దుల్క‌ర్ స‌ల్మాన్ ఫ్యాన్స్ ర‌కుల్‌పై మండిప‌డుతున్నారు. జెమినీ గ‌ణేష‌న్ పాత్ర‌లో ఒదిగి ఎంతో అద్భుతంగా న‌టించిన ఆయ‌న‌ని ఎలా మ‌రిచిపొయావు అంటూ దుల్క‌ర్ అభిమానులు ఆమె పోస్ట్‌కి కామెంట్స్ పెడుతున్నారు.