శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 డిశెంబరు 2020 (14:13 IST)

రకుల్ ప్రీత్ సింగ్‌కు ఇల్లు గిఫ్టుగా ఇచ్చిన వ్యక్తి ఎవరు?

తెలుగు చిత్ర పరిశ్రమలోని సీనియర్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆమె మూవీ కెరీర్ సాగిపోతోంది. కేవలం సౌత్‌ ఇండస్ట్రీలోనే కాకుండా, బాలీవుడ్ కూడా‌ ఈ అమ్మడు రాణిస్తోంది. 
 
ఈ క్రమంలో రకుల్ వ్యక్తిగత జీవితం కూడా ఇటీవలి కాలంలో వివాదాస్పదంగా మారింది. ఆమెపై వచ్చినన్ని పుకార్లు, వార్తలు మరే హీరోయిన్‌పై కూడా వచ్చుండవేమో. బాలీవుడ్ డ్రగ్స్ కేసు అంశంలో రకుల్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. తాజాగా ఆమెకు ఒక వ్యక్తి ఇల్లు గిఫ్టుగా ఇచ్చాడంటూ.. పలు రకాల కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
 
వీటిపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. మన గురించి పుకార్లు పుట్టించే వ్యక్తులు ఒక్క క్షణం కూడా మన గురించి ఆలోచించరని చెప్పింది. నేను ఉంటున్న ఇల్లు కూడా ఒక వ్యక్తి గిఫ్టుగా ఇచ్చాడని ప్రచారం చేస్తున్నారని... ఎవరో తనకు ఇంటిని గిఫ్టుగా ఇచ్చినప్పుడు, ఇక తాను ఇలా పని చేసుకోవలసిన అవసరం ఏముందని ఎదురు ప్రశ్న వేస్తోంది. 
 
తనపై ఇలాంటి పుకార్లు రావడం ఇదే తొలిసారి కాదని గుర్తుచేసింది. అందుకే పుకార్లను పట్టించుకోవడాన్ని తాను ఎప్పుడో మానేశానని తెలిపింది. పుకార్లపై మనం స్పందించాల్సిన అవసరం లేదని... మన పనే అన్నింటికీ సమాధానం చెపుతుందని వ్యాఖ్యానించింది. కాగా, ఈ అమ్మడు ప్రస్తుతం సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో పలు చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతున్న విషయం తెల్సిందే.