అమితాబ్, అజయ్‌దేవ్‌గన్‌తో రకుల్ సినిమా
రకుల్ ప్రీత్‌సింగ్ దక్షిణాదిలో బిజీ అయిన హీరోయిన్. తను నెంబర్ 1గా ఎదిగింది. ఆమెకు సినిమాలే సినామలే. కరోనా తర్వాత అంత బిజీగా ఎవరూ లేరంటూ ఇటీవలే వార్తలు వచ్చాయి. వీటన్నిటికీ రకుల్ మేనేజర్ హరినాథ్ వివవరణ ఇచ్చారు.
ఆయన చెప్పిన దాన్నిబట్టి. రకుల్ దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ బిజీగా వుంది. అయితే ఇది ఇటీవలే సైన్ చేసిన సినిమా. మేడే.. సినిమా టైటిల్. ఇందులో అమితాబ్, అజయ్ దేవగన్.. లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇది చాలా ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ అని రకుల్ తెలియజేస్తుంది. ఇది కాక మరో రెండు సినిమాల్లోనే ఆమె కమిట్ అయినట్లు చెప్పారు. అర్జున్ కపూర్‌తోపాటు జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న యటాక్‌లో నటిస్తోంది.
ఇక తెలుగులో క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందుతోన్న చెక్ సినిమాలో నటిస్తోంది. నితిన్ ఇందులో కథానాయకుడు. రకుల్ అడ్వకేట్‌గా నటిస్తోంది. ఇందుకోసం తను కొంతమంది లాయర్లను కలిసి పాత్రపరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతోంది.
మరోవైపు ఇంకా టైటిల్ నిర్ణయించని సినిమా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇందులో విలేజ్ అమ్మాయిగా మెరిపించనుంది. ఇంకోవైపు తమిళంలో శివకార్తికేయన్ కు జోడిగా నటించనుంది. ఇన్ని ప్రాజెక్ట్‌లు తగు ప్రణాళికతో చేయనున్నట్లు రకుల్ చెబుతోంది. కొరోనా వల్ల రెస్ట్ తీసుకున్నా.. ఇప్పుడు విజృంభిస్తున్నదన్నమాట.