మంగళవారం, 28 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జనవరి 2025 (17:26 IST)

Sankranti: రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా సంక్రాంతి ఫోటో.. గేమ్ ఛేంజర్‌పై చెర్రీ స్పందన

Ram Charan
Ram Charan
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కుటుంబంతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకున్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసన, తాను, రామ్ చరణ్, వారి కుమార్తె క్లిన్ కారాతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రంతో పాటు, ఉపాసన అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు."మీ నిరంతర ప్రేమ, ఆప్యాయతకు ధన్యవాదాలు" అని ఉపాసన తన పోస్ట్‌లో పేర్కొంది. ఈ ఫోటో ఆమె హృదయపూర్వక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పోస్టుపై స్పందించిన అభిమానులు కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.
 
ఇప్పటికే రామ్ చరణ్ తాజా చిత్రం గేమ్ ఛేంజర్ జనవరి 10న విడుదలైంది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
 
అలాగే గేమ్ చేంజర్ సినిమా ఫలితంపై తాజాగా రామ్‌ చరణ్‌ స్పందించారు. ఆయన సోషల్‌ మీడియాలో అభిమానులకు, మీడియాకి, ఆడియెన్స్‌కి థ్యాంక్స్ చెబుతూ నోట్‌ విడుదల చేశారు.
 
ఈ సంక్రాంతికి తన హృదయం ఆనందంతో నిండిపోయిందని, గేమ్‌ ఛేంజర్ సినిమా కోసం మేం పడ్డ కష్టం కనిపిస్తుందని, ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నా చిత్ర బృందానికి, నటీనటులు, టెక్నీషియన్లకి, ఈ సినిమా సక్సెస్‌లో భాగమైన వారికి ధన్యవాదాలు అని తెలిపారు చరణ్‌.