మంగళవారం, 14 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 జనవరి 2025 (16:40 IST)

నా అభిమాన హీరో బన్నీ లేదా చెర్రీ కాదు... ఎవరంటే : సుకుమార్

ram charan - sukumaran
టాలీవుడ్ దర్శకుడు కె.సుకుమార్ పేరు ఇపుడు భారతీయ చిత్రపరిశ్రమలో మార్మోగిపోతుంది. గతంలో రామ్ చరణ్ హీరోగా రంగస్థలం చిత్రాన్ని నిర్మించారు. ఇపుడు అల్లు అర్జున్ హీరోగా పుష్ప మూవీని రెండు భాగాలుగా తెరకెక్కించారు. తొలి సినిమా ఘన విజయం సాధించింది. రెండో భాగం అంతకంటే ఎక్కువగా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఫలితంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక మొత్తంలో కలెక్షన్లు రాబట్టిన మూవీగా నిలిచింది. దీంతో పాన్ ఇండియా డైరెక్టరుగా సుకుమార్ గుర్తింపు తెచ్చుకున్నారు. 
 
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో అతి కీలకమైన విషయాలను సుకుమార్ పంచుకున్నారు. తాను హీరో రాజశేఖర్ అభిమానిని అని సుకుమార్ వెల్లడించారు. ఆయన నటించిన అంకుశం, ఆహుతి, అగ్రహం, తలంబ్రాలు, మగాడు తదితర సినిమాలు తనను ఎంతో ప్రభావితం చేశాయని చెప్పారు. చదువుకునే రోజుల్లో రాజశేఖర్ సినిమాలు బాగా చూసే వాడినని తెలిపారు. అప్పట్లో ఆయనను బాగా ఇమిటేట్ చేస్తుండేవాడినని, అది చూసిన తన స్నేహితులు అందరూ వన్స్ మోర్ అంటూ ప్రోత్సహించారని తెలిపారు. 
 
తన ప్రతిభకు అనేక మంది ఫ్యాన్స్ కూడా అయ్యారన్నారు. తాను సినిమాల్లోకి వెళితే ఏదైనా చేయగలను అనే నమ్మకం హీరో రాజశేఖర్ వల్లే కలిగిందంటూ గత విషయాలను చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సుకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.