Dharma Sangrah
✕

వినయ విధేయ రామ ఫస్ట్ లుక్ ఎలా వుందో చూడండి..

Updated: మంగళవారం, 6 నవంబరు 2018 (13:53 IST)
''రంగస్థలం'' సినిమా తర్వాత రామ్ చరణ్ నటించే సినిమా వినయ విధేయ రామ. ఈ సినిమాకు బోయపాటి శీను దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, చరణ్ సరసన కథానాయికగా కైరా అద్వాని కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. 
 
బోయపాటి యాక్షన్ మార్కుకు తగినట్టుగా, శత్రువులపై విరుచుకుపడుతున్నట్లు చరణ్ ఈ పోస్టర్లో కనిపించాడు. చెర్రీ లుక్ తన అభిమానులను ఖుషీ చేస్తున్నట్లు వుంది. ఈ సినిమా నుంచి ఈ నెల 9వ తేదీన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. 
 
వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ప్రశాంత్ .. స్నేహ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.  స్నేహ, జీన్స్‌ ఫేమ్‌ ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

అన్నీ చూడండి

బీజేపీలో చేరిన భారత స్టార్ లెగ్ స్పిన్నర్ చాహల్

శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాలు - పేరు వెల్లడించని అజ్ఞాత భక్తుడు

చోరీ పేరుతో వచ్చి... ఆస్పత్రిలో మహిళకు లైంగిక వేధింపులు....

Weather Forecast: నవంబర్ 22, 2026న తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంటుందంటే..?

అనిరుధ్-కావ్య మారన్ రిసెప్షన్‌కు హాజరైన మంత్రి నారా లోకేష్ కుటుంబం

అన్నీ చూడండి

శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?

డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్‌కు పాలీహెర్బల్ యాంటీ డయాబెటిక్ ఫార్ములా : ఎస్ఆర్ఎంటీ వెల్లడి

సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్

చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు

మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?

తర్వాతి కథనం
Show comments