ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 26 జనవరి 2024 (15:19 IST)

ఈ గొప్ప దేశంలో మీరొక నిష్కళంక పౌరుడు : రామ్ చరణ్ ట్వీట్

chiranjeevi
మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ ప్రకటించింది. దీనిపై చిరంజీవి కుమారుడు, సినీ హీరో రామ్ చరణ్ స్పందించారు. ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డు అందుకోబోతున్న చిరంజీవి గారికి కంగ్రూచ్యులేషషన్స్. ఈ పురస్కారానికి మీరు అన్ని విధాలా అర్హులు. భారతీయ సినిమాకు, సమాజానికి విస్తృత స్థాయిలో మీరు అందించిన సేవలు, నన్ను తీర్చిదిద్దడంలోనూ, అశేష అభిమానులకు స్పూర్తిగా నిలవడంలోనూ కీలకపాత్ర పోషించారు. ఈ గొప్ప దేశంలో మీరొక నిష్కళంక పౌరుడు. 
 
చిరంజీవి గారికి ఇంతటి విశిష్ట గుర్తింపును, గౌరవాన్ని ఇచ్చినందుకు భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎంతో మద్దతు నిలిచిన అభిమానులు, శ్రేయోభిషాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం" అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. 
 
అలాగే, మరో మెగా ఫ్యామిలీ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందిస్తూ, 'ప్రతిష్ఠాత్మకమైన పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు, తెలుగు ప్రజలకు ఇదొక గొప్ప గౌరవం. ఈ అచీవ్‌మెంట్‌ను ఎంతో గౌరవంగా భావిస్తున్నా. మమ్మల్నందరినీ ఎంతో గర్వించేలా చేసినందుకు ధన్యవాదాలు' అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటివరకు చిరంజీవి సాధించిన ఘనతలను పేర్కొంటూ, ఆయన ఫొటోను షేర్ చేశారు. 
 
అలాగే, భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడకి, ప్రముఖ నటుడు చిరంజీవి గార్లకు శుభాకాంక్షలు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన పలు రంగాలకు చెందిన తెలంగాణ సృజనకారులు… ప్రముఖ చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య, బుర్ర వీణ కళాకారుడు దాసరి కొండప్ప, వేలు ఆనందా చారి, కేతావత్ సోమ్‌లాల్, కూరెళ్ళ విఠలాచార్యకు కూడా హృదయపూర్వక అభినందనలు అంటూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.