1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 6 మే 2025 (12:30 IST)

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

Chiru, Ramcharan family
Chiru, Ramcharan family
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన, క్లిన్ కారా, చిరంజీవి, సురేఖ గారు లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం లండన్ వెళుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫొటోకూడా పెట్టారు. ఈ విగ్రహ ఆవిష్కరణ లండన్‌లో  మే 9, 2025న స్థానిక సమయం సాయంత్రం 6:15 గంటలకు జరగనుంది. ఈ సందర్భంగా అభిమానులు అక్కడ సంబరాలకు ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తోంది.
 
రాజమౌళి తీసిన 'ఆర్ఆర్ఆర్'  తర్వాత రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ లెవల్ కు పెరిగింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో చేసిన నాటు నాటు పాట ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. అంతేకాదు ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్  అవార్డును కూడా గెలుచుకుంది. గతేడాది రామ్ చరణ్ కు సంబంధించిన కొలతలను కూడా తీసుకున్నారు. తాజాగా ఈ మైనపు విగ్రహాన్ని లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో ఆవిష్కరించనున్నారు.
 
ఇంతకుముందు ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టారు. తాజాగా రామ్ చరణ్ మైనపు విగ్రహం కొలువు దీరింది. ఈ మైనపు విగ్రహంలో రామ్ చరణ్ పెంపుడు కుక్క కూడా ఉండటం విశేషం. పెంపుడు పెట్ ను కూడా కొలతలు తీసుకున్నారు. కాగా, ‘గేమ్ చేంజర్’ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో చరణ్ ‘పెద్ది’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే యేడాది రామ్ చరణ్ బర్త్ డే కానుకగా మార్చి 27న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.