సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 జనవరి 2017 (14:39 IST)

సుకుమార్ - రామ్ చరణ్ మూవీ షూటింగ్ స్టార్ట్.. న్యూ లుక్ అదుర్స్

దర్శకుడు సుకుమార్ మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ కాంబినేషన్‌లో సరికొత్త చిత్రం తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నంబర్ 3గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సోమ

దర్శకుడు సుకుమార్ మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ కాంబినేషన్‌లో సరికొత్త చిత్రం తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నంబర్ 3గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఇందుకోసం జరిగిన పూజా కార్యక్రమాల్లో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ, చిత్ర యూనిట్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
 
ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం యాక్షన్, హాస్యం, సెంటిమెంట్స్, శృంగారాలు సమపాళ్లలో ఉండేలా దర్శకుడు కథను రూపొందించగా, ఇందులో హీరో రామ్ చరణ్ గ్రామీణ యువకుడి పాత్రలో నటించనున్నాడు. 
 
కాగా, 'ధృవ' విజయం తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం కాగా, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'నాన్నకు ప్రేమతో' చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించాడు. 'శ్రీమంతుడు', 'జనతా గ్యారెజ్' వంటి భారీ హిట్ చిత్రాలను అందించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.