బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 13 మే 2018 (10:43 IST)

పూరీ ఫీలైతే నేనేం చేయను.. పవన్‌ను తిట్టడానికి శ్రీరెడ్డి అడ్డమా?: వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పీకేను కదిలించాడు. అక్కినేని నాగార్జునతో ''ఆఫీసర్'' సినిమాను రూపొందిస్తున్న వర్మ.. ఓ ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను విమర్శించేందుకు శ్రీరెడ్డిని అ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పీకేను కదిలించాడు. అక్కినేని నాగార్జునతో ''ఆఫీసర్'' సినిమాను రూపొందిస్తున్న వర్మ.. ఓ ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను విమర్శించేందుకు శ్రీరెడ్డిని అడ్డం పెట్టుకోవడం ఎందుకనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.
 
ఈ వ్యవహారం మొత్తానికి సంబంధించిన వివరణను యూట్యూబ్‌లో పోస్టు చేశానని వర్మ తెలిపాడు. ఈ వ్యవహారంపై ఎవరికైనా ఆసక్తి ఉంటే తన వీడియోను చూసుకోవచ్చని వర్మ సమాధానం ఇచ్చారు. తాను ఎన్నడూ దేనికీ కూడా విచారాన్ని వ్యక్తం చేయబోనని, ముందుకు వెళుతూ ఉండటమే తన కర్తవ్యమని తెలిపారు. 
 
అలాగే వర్మ కామెంట్లతో తాను ఫీల్ అయినట్టు పూరీ జగన్నాథ్ చెప్పడాన్ని ప్రస్తావిస్తూ, కామెంట్లు చేయడం తన హక్కు అని, ఫీల్ కావడం పూరీ హక్కని తెలిపాడు. తాను చెప్పేవాటిని అర్థం చేసుకోలేని వాళ్లే తనను సైకో అంటారని వర్మ చెప్పుకొచ్చాడు. అయినా వాటిని పెద్దగా పట్టించుకోనని వర్మ తేల్చి చెప్పాడు.