మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By kowsalya
Last Updated : శనివారం, 5 మే 2018 (12:47 IST)

''ఆఫీసర్" ట్రైలర్ వీడియోను ఓ లుక్కేయండి (వీడియో)

రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం ''ఆఫీసర్". మైరా శరీన్ కథానాయికిగా ఈ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టిజర్ విడుదల చేయగా దీనికి అభిమాను

రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన చిత్రం ''ఆఫీసర్". మైరా శరీన్ కథానాయికిగా ఈ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టిజర్ విడుదల చేయగా దీనికి అభిమానుల నుంచి విశేషాదరణ లభించింది. ముంబై నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రంలో నాగార్జున్ డైలాగ్స్, సన్నివేశాల చిత్రీకరణ, టేకింగ్ ఆద్యంతం వర్మ స్టిల్‌కు తగ్గట్టుగానే ఉన్నాయి.
 
నాగార్జున పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్న చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను మే 12న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఎ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌గోపాల్ వర్మ, సుధీర్ చంద్ర సంయుక్తంగా సినిమాను నిర్మించారు. మే 25న ''ఆఫీసర్'" సినిమాను విడుదల చేయనున్నట్లు డైరక్టర్ వర్మ ప్రకటించారు.