బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (12:51 IST)

పోలీసు యోధుడుగా రామ్ పోతినేని

The Warrior poster
ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు రామ్ పోతినేని, ఎన్ లింగుసామి దర్శకత్వంలో నటిస్తున్న ద్విభాషా చిత్రం వివ‌రాల‌ను చిత్ర యూనిట్ సోమ‌వారంనాడు కొద్దిగా ప్ర‌క‌టించింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ చిత్ర ప్ర‌చార చిత్రం విడుద‌ల చేసింది. అందులో టైటిల్‌ను “ది వారియర్” అంటూ తెలియ‌జేసింది. ఈ పోస్టర్‌ లో రామ్ పోతినేని తన పోలీసు బృందంతో కలిసి ఒక ముఖ్యమైన మిషన్‌లో పోలీసు అధికారిగా కనిపించాడు. పోలీసు యోధుడిగా రామ్ పోతినేని ఏం చేయ‌బోతున్నాడ‌నేది సినిమాలో చూడాల‌నే ఆస‌క్తిని ఆ పోస్ట‌ర్ క‌లగ‌జేసింది.
 
`రెడ్‌` సినిమా త‌ర్వాత రామ్ పోతినేని న‌టిస్తున్న చిత్ర‌మిది. యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ద‌ర్శ‌కుడు లింగుసామి తీర్చిదిద్దుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆది పినిశెట్టి విలన్‌గా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, అక్షర గౌడ కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా గురించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌నున్నాయి.