శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 10 మే 2022 (11:53 IST)

విశాఖపట్నం పోలీస్‌స్టేష‌న్‌లో రామ్‌చ‌ర‌ణ్!

Ramcharan at madhuavada
Ramcharan at madhuavada
ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ త‌న కొత్త సినిమాను స్పీడ్ పెంచాడు. త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్‌.సి.15 సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ అప్ప‌డ‌ప్పుడు జ‌రుగుతూ మ‌ధ్య‌లో గేప్‌లు తీసుకుంది. తాజా షెడ్యూల్ కోసం విశాఖ‌ప‌ట్నం వ‌చ్చాడు రామ్‌చ‌ర‌ణ్‌. అక్క‌డ మ‌ధుర‌వాడ వీధుల్లో ఆయ‌న రావ‌డం చూసిన అభిమానులు ఫొటోల‌కోసం ఎగ‌బ‌డ్డారు.
 
విశాఖ మ‌ధుర‌వాడ‌లో సంద‌డి చేసిన రామ్ చ‌ర‌ణ్ ఆర్‌.కె.బీచ్‌లోని పాత పోలీస్ స్టేష‌న్‌కు వెళ్ళారు. ఆ ద‌గ్గ‌ర‌లోని అపార్ట్‌మెంట్‌లో కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఇందుకు సంబంధించిన పోలీస్ స్టేష‌న్‌ను రామ్‌చ‌ర‌ణ్ ప‌రిశీలించారు. ఈ సినిమాలో చ‌ర‌ణ్ క్రేజీ డాన్స్ మూవ్‌మెంట్ చేస్తున్నాడ‌ని తెలిసింది. శేఖ‌ర్ మాస్ట‌ర్ దీనిని కంపోజ్ చేయ‌నున్నార‌ట‌. త్వ‌ర‌లో ఈ సినిమా గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి.