సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 26 మార్చి 2021 (19:40 IST)

మీ ప్రేమ‌కు దాసుడ్ని అయ్యానంటున్న రామ్‌చ‌ర‌ణ్‌

Ramcharn house
మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు వేడుక‌లు గ‌త వారంరోజులుగా రాజ‌మండ్రి, ప‌రిస‌ర ప్రాంతాల‌లో అభిమానులు సంద‌డిగా జ‌రుపుతున్నారు. ఆయ‌న పుట్ట‌న రోజు ఈనెల 27వ తేదీ. అందుకే శుక్ర‌వార‌మే ఆయ‌న న‌టించిన తాజా సినిమా `ఆర్‌.ఆర్‌.ఆర్‌.`లోని అల్లూరి సీతారామ‌రాజు గెట‌ప్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. దానికితోడు ఈరోజు సాయంత్ర‌మే హైద‌రాబాద్లోని శిల్ప‌క‌ళావేదిక ప్రాంగ‌ణంగా పుట్టిన‌రోజు స‌భ‌ను అభిమానులు ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా మ‌ధ్యాహ్నం నుంచే చ‌ర‌ణ్ అభిమానులు జూబ్లీహిల్స్‌లోని ఆయ‌న ఇంటి ద‌గ్గ‌ర సంద‌డి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన అభిమానులు ఇంటిముందు గేటుద‌గ్గ‌ర ఆయ‌న రాక కోసం వేచి వున్నారు.

Ramcharn fnas
మెగాస్టార్ జిందాబాద్‌, చ‌ర‌ణ్ జిందాబాద్‌, అంటూ పోరాట యోధుడా అల్లూరి సీతారామరాజు మా కోసం బ‌య‌టి రండి.. అంటూ ఆనందంతో నినాదాలు చేశారు. అప్ప‌టికే ఇంటిముందు వున్న బౌన్స‌ర్లు వారిని క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో పెట్టారు. ఇంటిలోనుంచి రామ్‌చ‌ర‌ణ్ డాబాపై నుంచి వారంద‌రికీ అభివాదం చేశారు. అనంతం కింద‌కి వ‌చ్చి గేటు పైన ఎక్కి అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలుపుతూ, మీరంతా మా కుటుంబ‌పై చూపుతున్న ప్రేమ‌కు దాసుడ్ని అయిపోయానంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. సాయంత్రం జ‌రిగే వేడుక‌లో కూడా పాల్గొని అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఇళ్ల‌కు వెళ్ళాల‌ని సూచించారు.‌