గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (18:57 IST)

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. మందుబాబులకు షాక్

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. కరోనా కట్టడిలో భాగంగా హైదరాబాద్ మందు బాబులకు పోలీసులు షాక్ ఇచ్చారు. హోలీ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లోని వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్‌ పాటించాల్సిందిగా తెలుపుతూ హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. 
 
మార్చి 28వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని అంజనీ కుమార్ వెల్లడించారు. కరోనా కారణంగా ఇతరులకు అసౌకర్యం కలిగించడం, రోడ్డుపై రంగులు చల్లడం, గుంపులుగా వాహనాలపై తిరగడం వంటి తదితర చర్యలు నిషేధిస్తూ మరో ప్రత్యేక ఉత్తర్వులు వెలువరించారు. ఈ నియమాలను ఉల్లంఘించి నైట్లెతే అటువంటి వ్యక్తులు విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.