శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 6 జులై 2020 (15:07 IST)

అప్సరా రాణితో ఆ పని జస్ట్ ఇప్పుడే పూర్తి చేశానంటున్న వర్మ

కరోనావైరస్ టైంలోనూ సినీ ఇండస్ట్రీలో ఎవరయినా బిజీగా వున్నారూ అంటే అది రాంగోపాల్ వర్మ అని చెప్పక తప్పదు. వరుస లఘు చిత్రాలతో దూసుకుపోతున్నారు వర్మ. ఇప్పటికే లాక్ డౌన్ సమయంలో రెండుమూడు చిత్రాలను జనంపైకి వదిలి తనలో వున్న కసి ఏమిటో చూపించారు.
 
ఇప్పుడు థ్రిల్లర్ అంటూ మరో చిత్రాన్ని లాగించేస్తున్నారు. జనంలో ఎప్పుడూ చర్చల్లో వుండే విధంగా ప్లాన్ చేసుకోవడం వర్మకే తెలుసు. ఇందులో భాగంగా అప్పుడప్పుడూ తను చేస్తున్న పనులను ట్విట్టర్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసుకుంటూ వుంటారు.
తాజాగా తను తీస్తున్న థ్రిల్లర్ చిత్రంలో అప్సరా రాణితో జస్ట్ లంఛ్ ముగించానంటూ ఓ పిక్ వదిలారు. ఇదిలావుంటే ఆ చిత్రంలో నటిస్తున్న అప్సరా రాణి ఇలా ట్విట్టర్ ఖాతా తెరిచిందో లేదో 5,000 మంది ఫాలో అవుతున్నారు. దీనిపై ఆమె ఉబ్బితబ్బిబ్బవుతోంది. వర్మా మజాకా?