వ్యూహం నుంచి మరో టీజర్.. పవన్‌కు అంత సీన్ లేదు.. వెన్నుపోటు?
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్‌పై జరిగిన కుట్రలు, జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది వ్యూహం సినిమా ద్వారా తెరపైకి చూపెట్టనున్నారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా రెండు పార్టులుగా విడుదల కానున్నాయి.
ఇప్పటికే వ్యూహం నుంచి ఒక టీజర్ విడుదల చేయగా తాజాగా వ్యూహం సినిమా నుంచి మరో టీజర్‌ని విడుదల చేశారు ఆర్జీవీ. ఇక ఈ టీజర్‌లో రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత పరిస్థితులు చూపించారు. ఇక ఇందులో జగన్, జగన్ ఫ్యామిలీతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సోనియా గాంధీ, రోశయ్య, చిరంజీవి, అల్లు అరవింద్, మన్మోహన్ సింగ్.. ఇలా అనేకమంది పాత్రలని చూపించాడు ఆర్జీవీ.
టీజర్ చివర్లో ఏదో ఒక రోజు కళ్యాణ్‌ను కూడా వెన్నుపోటు పొడుస్తారు కదా అని బాబును అడగగా.. వాడికి అంత సీన్ లేదు.. వాడిని వాడే వెన్నుపోటు పొడుచుకుంటాడు అనే డైలాగ్ నెట్టింట వైరల్ అవుతోంది.