శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 మే 2023 (09:24 IST)

పవన్‌పై విమర్శలు గుప్పించిన రామ్ గోపాల్ వర్మ

Varma
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ తన సొంత అభిమానులకు, అనుచరులకు ద్రోహం చేయడమే కాకుండా తనకు కూడా ద్రోహం చేశాడని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. 
 
ఇంకా పవన్ కళ్యాణ్ వీడియోను పోస్ట్ చేసి, "పార్టీ, పిడికిలి, ఎర్రటి కండువాలు, వేళ్లు.." అని చెప్పడం చాలామంది ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గత ఎన్నికల్లో తమ పార్టీ 30-40 సీట్లు గెలుపొంది ఉంటే ఈసారి ముఖ్యమంత్రి పదవి కోసం తాను పోటీలో ఉండేవాడినని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం తెలిసిందే.
 
"ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన దానికన్నా దారుణంగా ఈ రోజు పవన్ కల్యాణ్ తన జనసైనికులని, తన ఫ్యాన్స్‌ని వెన్నుపోటు పొడిచి చంపేసాడు.. వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ నా ప్రగాఢ సానుభూతి.."అంటూ వర్మ చెప్పుకొచ్చారు.