సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : గురువారం, 11 మే 2023 (17:49 IST)

ఈసారి పెర్ ఫామెన్స్ బద్దలై పోద్ది : పవన్ కళ్యాణ్

Pawan kalyan
Pawan kalyan
పవన్ కళ్యాణ్,  పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ నేడు విడుదల అయింది. ఘంటసాల వోయిసుతో భగవత్ గీతలో.. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మం వృద్ధి నొందునో ప్రతి యుగమున అవతారం దాలుస్తాను అన్న శ్రీకృష్ణుడు మాటలు వినిపిస్తాయి.  వెంటనే.. భగత్.. మహంకాళి పోలీస్ స్టేషన్ పాట బస్తి.. అంటూ జీప్ నుంచి దిగుతాడు పవన్. స్టేషన్లో కొందరిపై కోపంగా దాడి చేస్తాడు.. ఆ తర్వాత కుర్చీలో కూర్చొని ఈసారి పెర్ ఫామెన్స్ బద్దలై పోద్ది అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ తో గ్లిమ్ప్స్ ముగిసింది. 
 
పూర్తి యాక్షన్ సినిమాగా అనిపిస్తుంది. గ్లిమ్ప్స్ కు మంచి ఆదరణ సోషల్ మీడియాలో నెలకొంది. దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ . పంకజ్ త్రిపాఠి తదితరులు నటిసున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.