సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 11 జనవరి 2019 (11:25 IST)

కేజీఎఫ్ సీక్వెల్.. పవర్ ఫుల్ పాత్రల్లో రమ్యకృష్ణ, సంజయ్ దత్

కన్నడ, తెలుగు, హిందీల్లో విడుదలైన కేజీఎఫ్ భారీ ఓపెనింగ్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రెండో భాగానికి సంబంధించి సంజయ్ దత్, రమ్యకృష్ణల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిర్మాత విజయ్ కిరంగన్ దుర్ ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టేశారు. ఈ సినిమాలో భారత రాష్ట్రపతి రిమికా సేన్ పాత్రలో రమ్యకృష్ణ కనిపిస్తుందనీ .. కొత్తగా క్రియేట్ చేసిన ఒక పవర్ ఫుల్ పాత్రలో సంజయ్ దత్ కనిపిస్తాడని అంటున్నారు. 
 
దుబాయ్ మాఫియాపై యష్ చేసే ఎదురుదాడులు ఈ సినిమాకి హైలైట్‌గా నిలవనున్నాయని సినీ యూనిట్ వెల్లడిస్తోంది. క‌న్నడ చిత్రపరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా గుర్తింపు పొందిన చిత్రం కేజీఎఫ్. గత డిసెంబరు 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం.. భారీ వ‌సూళ్ల‌ను రాబట్టింది. కన్నడ, హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించగా, దీన్ని 2400 థియేటర్లలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.