శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 31 డిశెంబరు 2018 (13:33 IST)

గర్భవతిని చేసి.. ఆ బిడ్డ నాదైతేనే పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఎక్కడ?

ప్రేమ పేరుతో వెంటపడి.. వివాహం చేసుకుంటానని నమ్మించి.. కోరిక తీర్చుకున్నాక మొహం చాటేశాడు.. ఓ ప్రబుద్ధుడు. ప్రేమ పేరుతో మోసం చేసి.. లోబరుచుకుని గర్భవతిని చేసిన ప్రేయసిని పెళ్లి చేసుకోనని చెప్పేశాడు. అంతటితో ఆగకుండా.. కడుపులో వున్న బిడ్డ తనదేనని నిరూపించాక.. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో ఆ యువతి ఆందోళనకు దిగింది. ఈ ఘటన తెలంగాణలోని జయశంకర్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కన్నాయిగూడెం మండలం, బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన విజయ్ కుమార్.. అనే గ్రామానికి చెందిన నాగమణి రెండేళ్ల పాటు ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో నాగమణిని లొంగదీసుకున్న విజయ్.. ఆమెను గర్భవతిని చేశాడు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని నాగమణి కోరగా, విజయ్ కుమార్ అందుకు నిరాకరించాడు. కానీ పెద్దమనుషుల పంచాయితీ పెట్టడంతో పెళ్లికి అతను ఒప్పుకున్నాడు. 
 
అంతలోనే నాగమణి గర్భం దాల్చడానికి, తనకు సంబంధం లేదని విజయ్ కుమార్ బుకాయించాడు. బిడ్డకు డీఎన్‌ఏ పరీక్షలు చేసి తనకే పుట్టాడని నిర్ధారణ అయితేనే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశాడు. దీంతో బాధితురాలు విజయ్ కుమార్ ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.