మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

అవును.. ఆమెను ఇష్టపడుతున్నా... ఎక్సైటింగ్‌గా ఉంది : రణ్‌బీర్

బాలీవుడ్‌లో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమాయణాలు కొత్తేమి కాదు. తాజాగా బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్‌లు ప్రేమలో పడ్డారనీ, వీరిద్దురూ కలిసి డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు షికారు చేశాయి. ఈ

బాలీవుడ్‌లో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమాయణాలు కొత్తేమి కాదు. తాజాగా బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్‌లు ప్రేమలో పడ్డారనీ, వీరిద్దురూ కలిసి డేటింగ్ చేస్తున్నట్టు పుకార్లు షికారు చేశాయి. ఈ వార్తలపై రణ్‌బీర్ స్పందించారు.
 
బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం "సంజూ". ఈ చిత్రం ట్రైలర్‌ తాజాగా విడుదల కాగా, అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రం ఈనెలాఖరులో ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఈ సందర్భంగా రణ్‌బీర్ స్పందిస్తూ, అవును అలియాను ఇష్టపడుతున్నా. ఇప్పుడే ప్రేమ మొదలైంది. దీనిపై ఎక్కువగా మాట్లాడను. కాస్త సమయం కావాలి. అలియా ఓ అద్భుతమైన నటి, అంతకుమించి మంచి మనిషి అంటూ కితాబిచ్చారు. కొత్తగా ప్రేమలో పడినప్పుడల్లా తాను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పాడు.
 
పైగా, ఎక్సైటింగ్‌గా ఉంది. కొత్త వ్యక్తి.. అన్నీ కొత్తగా ఉన్నాయి. అయితే రెండేళ్ల కిందటితో పోలిస్తే నేనిప్పుడు చాలా మారిపోయాను. బంధాలకు విలువిస్తున్నాను అని ఈ స్టార్ హీరో అన్నాడు. ఒకరంటే మరొకరికి ఇష్టమని గతంలో ఈ ఇద్దరూ చెప్పినా.. తమ మధ్య ఉన్న బంధాన్ని పబ్లిగ్గా ఒప్పుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ ఇద్దరూ "బ్రహ్మాస్త్ర" అనే మూవీలో కలిసి నటిస్తున్నారు.