సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 జులై 2018 (12:39 IST)

అడిగనంత ఇస్తే కుర్ర హీరోలతోనూ సై అంటున్న 'జిగేల్ రాణి'

"రంగస్థలం" చిత్రంలోని జిగేల్ రాణి పాట ఎంత హిట్ అయిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ ఐటమ్ సాంగ్‌లో నటి పూజా హెగ్డే నటించింది. ఈమె ఇటీవలి కాలంలో పలు క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టిస్తోంది. ఈ భామ ఓవైపు అగ్ర‌క‌థానా

"రంగస్థలం" చిత్రంలోని జిగేల్ రాణి పాట ఎంత హిట్ అయిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ ఐటమ్ సాంగ్‌లో నటి పూజా హెగ్డే నటించింది. ఈమె ఇటీవలి కాలంలో పలు క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టిస్తోంది. ఈ భామ ఓవైపు అగ్ర‌క‌థానాయ‌కుల‌తో న‌టిస్తూనే, మ‌రోవైపు కుర్ర‌హీరోల సినిమాల‌కు సంత‌కాలు చేస్తోంది.
 
ప్ర‌స్తుతం బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ స‌ర‌స‌న 'సాక్ష్యం' చిత్రంలో న‌టించింది. ఈ సినిమాకు పూజా భారీ పారితోషికం అందుకుంద‌న్న ప్ర‌చారం సాగింది. అడిగినంతా ఇస్తే కుర్ర‌హీరోల‌తో కూడా నటించేందుకు సిద్ధమని ప్రకటించింది. 
 
ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ అగ్ర‌హీరోలు ఎన్టీఆర్‌, మ‌హేష్ సినిమాల‌తో బిజీగా ఉన్న పూజా త‌దుప‌రి ప్ర‌భాస్ స‌ర‌స‌న "జిల్" రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నుంది. పెద్ద హీరోల సంగతేమోగానీ, కుర్రహీరోల‌కు అయితే కోటి నుంచి కోటిన్న‌ర రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేస్తోందట‌. 
 
అందుకే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న 'సాక్ష్యం' చిత్రానికి ఈ అమ్మడు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఈ యేడాది మార్చి నెలలో వచ్చిన 'రంగ‌స్థ‌లం'లో ఐదు నిమిషాల ఐటెమ్ పాట‌కు రూ.50 ల‌క్ష‌లు అందుకున్నట్టు సమాచారం.