మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 10 మే 2018 (11:17 IST)

''జిల్'' రాధాకృష్ణ కోసం కొండలెక్కనున్న ప్రభాస్.. ఎందుకు?

''బాహుబలి'' సినిమాలో తమన్నా (అవంతిక) కోసం కొండలెక్కిన ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణతో చేసే సినిమా కోసం కొండలెక్కనున్నాడట. బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ సినిమా రూపుదిద్దుకుంటున్న సాహో సినిమాకు సంబంధించిన

''బాహుబలి'' సినిమాలో తమన్నా (అవంతిక) కోసం కొండలెక్కిన ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణతో చేసే సినిమా కోసం కొండలెక్కనున్నాడట. బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ సినిమా రూపుదిద్దుకుంటున్న సాహో సినిమాకు సంబంధించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ అబుదాబిలో చిత్రీకరించబడుతున్నాయి. ఈ సినిమా తరువాత ప్రభాస్ 'జిల్' ఫేమ్ రాధాకృష్ణతో ఒక సినిమా చేయనున్నాడు. 
 
ఈ సినిమా కోసమే ప్రభాస్ కొండలనెక్కనున్నాడని టాక్. కథానాయిక కోసం కొండకోనల్లో అన్వేషణ చేస్తూ ఆయన ముందుకే సాగే సన్నివేశాలు వుంటాయనీ.. ఇవే సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయని సినీ వర్గాల సమాచారం. హీరోయిన్ వెదుక్కుంటూ కొండలెక్కి, ఆమెను కనుగొనే విధంగా స్క్రిప్ట్ వుంటుందట. ఈ సినిమా షూట్ మాత్రం కొండ కోనల్లో వుంటుందని తెలుస్తోంది.
 
అలాగే టాలీవుడ్‌లో ట్రెక్కింగ్ టైపు సినిమాలు తక్కువ. ఎవడే సుబ్రహ్మణ్యం కొంత వరకు కవర్ చేసింది. ఇప్పుడు ప్రభాస్ సినిమా కాస్త ఎక్కువగానే కవర్ చేస్తుందని సినీ పండితులు అంటున్నారు. కాగా జిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించే సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా కనిపించనున్న సంగతి తెలిసిందే.