గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 మార్చి 2018 (13:15 IST)

చెర్రీకి బర్త్‌డే విషెస్ చెప్పిన 'రంగస్థలం' రంగమ్మత్త

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన తాజా చిత్రం రంగస్థలం. ఈ చిత్రం ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో సమంత హీరోయిన్‌ కాగా, రంగమ్మత్తగా హాట్ యాంకర్ అనసూయ నటిస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన తాజా చిత్రం రంగస్థలం. ఈ చిత్రం ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో సమంత హీరోయిన్‌ కాగా, రంగమ్మత్తగా హాట్ యాంకర్ అనసూయ నటిస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు బిజీగా సాగుతున్నాయి. అలాగే, ఈ చిత్రంలోని ఆడియో సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి.
 
ఈ నేపథ్యంలో రంగమ్మత్త క్యారెక్టర్‌లో అనసూయ ఫొటోలు ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా, అనసూయ మరో రెండు ఫొటోలను తన ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్ల‌లలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా రాంచరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ యేడాదంతా బ్లాక్ బస్టర్‌గా నిలిచిపోవాలంటూ కోరుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.